హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

WGL: చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. గురువారం సంగెం మండలం లోహిత గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవల తీరును కలెక్టర్ పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.