హైదరాబాద్: 28°C
తెలంగాణ

రజకుల సమస్యలపై మాట్లాడాలని MLA‌కు వినతి

ASF: అసెంబ్లీలో తమ సమస్యలను లేవనెత్తాలని MLA హరీష్ బాబుని రజక సంఘం నాయకులు కోరారు. గురువారం కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి రజక సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రజకుల సమస్యలను వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలో లేవనెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రజక సంఘం నాయకులకు హమీ ఇచ్చారు.