హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కుప్టి ఘాట్‌లో భారీ ట్రాఫిక్ జామ్

ADB: నేరడిగొండ మండలంలోని కుష్టి ఘాట్‌లో రెండు లారీలు బ్రేక్ డౌన్ కావడంతో గురువారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘాట్ సెక్షన్‌లో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు లారీలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.