GNTR: పొన్నూరు పురపాలక కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు గురువారం 26వ వార్డులో పర్యటించారు. డ్రైనేజీ ప్రవాహానికి అడ్డుగా ఉంటూ రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న అనధికార కల్వర్టులను వెంటనే తొలగించాలని అధికారులను, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్యానికి భంగం కలిగిస్తూ అనధికార నిర్మాణాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అనధికార కల్వర్టుల తొలగింపునకు ఆదేశం


