హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్

కరీంనగర్ జిల్లా నగర పాలక సంస్థ 21వ డివిజన్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకి మేయర్ శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం 44వ, డివిజన్ శ్రీనగర్ కాలనీ సంతోషిమాత ఆలయం వద్ద సీసీ రోడ్డు పనులకి మేయర్ శంకుస్థాపన చేశారు. 62వ డివిజన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.