హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరిలో వేదమంత్రోచ్ఛారణల మధ్య తీర్థం

BHNG: స్వర్ణగిరిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిత్యారాధన కోసం గురువారం ఉదయం 5:45 గంటలకు అర్చక స్వాములు బంగారు బావి నుంచి సువర్ణ బిందెతో తీర్థాన్ని శ్రద్ధాభక్తులతో తీసుకువచ్చారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ సాగిన ఈ పవిత్ర ఘట్టంతో స్వర్ణగిరి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు.