హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ అధికారుల గైర్హాజరుపై కమిషనర్ క్లారిటీ

సూర్యాపేట మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల నేపథ్యంలో అధికారులు విధులకూ రాలేదని వచ్చిన వార్తలను కమిషనర్ హనుమంతరెడ్డి ఖండించారు. అన్ని సెక్షన్లలో ఉద్యోగులు యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉన్నారని, కేవలం టీపీఓ కార్యాలయంలో మాత్రమే అందుబాటులో లేరని ఆయన స్పష్టం చేశారు. దీనితో ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు తెరపడింది.