KMR: బిక్కనూరు కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటరమణ గురువారం పరిశీలించారు. శ్రావణమాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు అస్వస్థత కలిగితే తక్షణ వైద్య సేవలు అందించేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల అవసరాల మేరకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచలన్నారు.
తెలంగాణ
వైద్య శిబిరాన్ని తనిఖీ చేసిన ఆరోగ్య విస్తరణ అధికారి


