MDK: కొల్చారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాగు కోసమే ప్రభుత్వం ఉచిత దుస్తులు అందిస్తోందని తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు తెలిపారు. గురువారం తుక్కాపూర్ ఎంపీపీఎస్ బడిలో విద్యార్థులకు ఆయన దుస్తులు పంపిణీ చేశారు. మన బడులను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో HM గణేష్, ఏఏపీ చైర్మన్ అనిల్, గ్రామ పెద్దలు, పాలకవర్గం పాల్గొన్నారు.
తెలంగాణ
సర్కారు బడుల అభివృద్ధికి ప్రాధాన్యం: సర్పంచ్


