శ్రీకాకుళానికి చెందిన వన్యప్రాణి నిపుణుడు మూర్తి కంటిమహంతికి అరుదైన గౌరవం దక్కింది. నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ "ఎక్స్పర్ట్ మెంబర్" గా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని నియమిస్తూ జీవో(No:42) ను ఇవాళ జారీచేసింది. తూర్పు కనుమల్లో అంతరించిపోతున్న కింగ్ కోబ్రాలు, పాంగోలిన్లు వంటి వన్యప్రాణుల రక్షణకు ఆయన కృషికి ఇది గుర్తింపు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వాసికి అరుదైన గౌరవం


