హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాల ప్రకటన

KRNL: మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆదోనిలోని 52 వార్డులకు సంబంధించి వార్డు వారీ ఫోటో ఓటర్ల జాబితాలను గురువారం ప్రజల పరిశీలన కోసం ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలక సంఘం, తహశీల్దార్, RDO కార్యాలయాలతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాబితాలను అందుబాటులో ఉంచారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవచ్చు.