ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ల రూపంలో రూ.1,912 కోట్లు ఉన్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. వీటిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ.1,811.10 కోట్లు ఉన్నట్లు చెప్పింది. మిగిలిన వంద కోట్లు వివిధ సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో ఉన్నట్లు పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథుడి పేరిట 60,821 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపింది.
వార్తలు
పూరీ జగన్నాథ ఆలయ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే?


