ఇటలీ ప్రధాని మెలోనీ రికార్డ్ సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సుదీర్ఘకాలం పదవిలో ఉన్న ఇటలీ ప్రధానిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా మెలోనీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-ఇటలీ సంబంధాలు మరింత బలోపేతం కావాలని మోదీ ఆకాంక్షించారు. భవిష్యత్తులో మెలోనీ మరిన్ని విజయాలు అందుకోవాలని అన్నారు. రెండు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని మోదీ పేర్కొన్నారు.
వార్తలు
ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ విషెస్


