హైదరాబాద్: 28°C
వార్తలు

కుదుపులకు లోనైన విమానం.. పైలట్‌పై చర్యలు

థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం ఆగస్టు 4న తీవ్ర కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. విమానంలో హైడ్రాలిక్ ప్రెజర్ కూడా గణనీయంగా తగ్గినట్లు దర్యాప్తులో అధికారులు నిర్ధారించారు. తాజాగా ఆ ఫ్లైట్ పైలట్ సైకోయాక్టివ్ డ్రగ్స్ వినియోగించినట్లుగా డోప్ టెస్ట్‌లో తేలింది. ఈ మేరకు AAIB విడుదల చేసిన ప్రాథమిక విచారణ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.