PLD: లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరైంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి ఈ స్టాప్‌ను కేటాయించేలా చొరవ తీసుకున్నారు. దీంతో రేపటి నుంచి ఈ రైలు పిడుగురాళ్లలో ఆగనుంది. స్థానిక ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగురాళ్లలో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్


