హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్, బ్రెజిల్ మ్యాచ్.. గంటలోనే టికెట్లు ఖతం

అక్టోబర్ 3న కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో భారత ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల ధరలను రూ.999 నుంచి రూ.15,000గా నిర్ణయించగా.. గంటలోనే టికెట్లన్నీ అమ్ముడవడం విశేషం. కాగా, ఫుట్‌బాల్ చరిత్రలో భారత జట్టు ఇప్పటివరకు బ్రెజిల్‌తో మ్యాచ్ ఆడలేదు.