ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది భారత క్రీడాకారులకు తోడుగా 246 మంది జట్టు అధికారులు, సహాయ సిబ్బంది వెళ్లనున్నారు. ఈ మేరకు క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అథ్లెటిక్స్ బృందానికి అత్యధికంగా 31 మంది సహాయ సిబ్బందిని ఇవ్వగా.. రెండు క్రికెట్ జట్లకు 20 మంది సహాయ సిబ్బంది ఉన్నారు. కాగా, ఈనెల 19 నుంచి జపాన్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. భారత్ 36 క్రీడాంశాల్లో పోటీపడనుంది.
క్రీడలు
భారత అథ్లెట్లకు తోడుగా 246 మంది


