హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు కాలువలతో జ్యోతినగర్ వాసుల అవస్థలు

JN: పట్టణంలోని జ్యోతినగర్ కాలనీలో మురుగు కాలువల నిర్వహణ సరిగా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. దోమల బెడద కూడా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే కాలువలను శుభ్రం చేసి, మురుగు నిల్వ లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు.