హైదరాబాద్: 28°C
తెలంగాణ

10 మండలాల్లో తాగునీటి సరఫరా బంద్

MDK: బోడుపట్ల వద్ద గోదావరి ప్రధాన పైప్‌లైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టనున్నందున బుధవారం నుంచి 10 రోజుల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. దీనివల్ల నర్సాపూర్, శివంపేట, గుమ్మడిదల సహా 10 మండలాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, పనులు పూర్తి కాగానే సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.