హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు. శ్రీకృష్ణుడి లీలలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు కృష్ణాష్టమి విశిష్టతను విద్యార్థులకు వివరించారు.