హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్

MHBD: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని నెల్లికుదురు మండలం వరంబండ జీపీ పరిధిలోని బడితండా సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృ అన్నారు. ఇవాళ ఆమె పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఏటా రెండు జతల దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంలో గుడ్లు, రాగిజావ వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.