హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తి గీతాలతో మార్మోగిన కాటారం ఆలయం

BHPL: కాటారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన 24 గంటల ఏకాహం భజన గురువారం ఉదయం భక్తిశ్రద్ధలతో ముగిసింది. బుధవారం ప్రారంభమైన భజన కార్యక్రమంలో భక్తులు తాళం, తబలా, గానంతో నిరంతరం దేవతలను కీర్తించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. భజనలతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.