హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేశ్వరి కుటుంబానికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

BHNG: వలిగొండ వేములకొండ గ్రామానికి చెందిన పులిపలుపుల రాములు చిన్న కుమార్తె మహేశ్వరి భర్త బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని 2010-11 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదుకున్నారు. కుటుంబానికి అండగా నిలిచి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మహేష్, రమేష్, మత్స్యగిరి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.