హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జాలరి గల్లంతు

VSP: చేపల వేటకు వెళ్లిన విశాఖ జాలరి సముద్రంలో గల్లంతయ్యాడు. దిబ్బపాలెంకు చెందిన రాము మరో ఇద్దరితో కలిసి గుజరాత్ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లాడు. సముద్రంలో బోటు ఆగిపోవడంతో మరమ్మతుల కోసం దిగిన రాము గల్లంతైనట్లు తోటి జాలర్లు చెప్పారు. రాము ఆచూకీ కోసం సంబంధిత కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టిందని విశాఖ ఫీషరీస్ JD వర్ధన్ గురువారం తెలిపారు.