హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సారెస్పీ కాలువలోకి దిగి బీఆర్‌ఎస్ నిరసన

MHBD: మహబూబాబాద్ జిల్లాలో నీరు లేక ఎండిపోయిన ఎస్సారెస్పీ కాలువలోకి దిగి బీఆర్‌ఎస్ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ముడుపుగల్ ఎస్సారెస్పీ బ్రిడ్జి వద్ద ఆందోళన నిర్వహించారు. కరువు పరిస్థితులు సహజసిద్ధం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో సాగునీటిని నిలిపివేసిందని బానోత్ శంకర్ నాయక్ ఆరోపించారు.