హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్టాండ్ వద్ద ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

GNTR: ఫిరంగిపురం బస్టాండ్ సమీపంలోని విద్యుత్ వైర్లపైకి చెట్ల తీగలు అల్లుకోవడంతో తీవ్ర ప్రమాదకరంగా మారింది. గాలివాన వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండటంతో వైర్లు తెగిపడితే పెద్ద ప్రమాదమే జరిగేలా ఉందని వాపోతున్నారు.అధికారులు స్పందించాలని కోరుతున్నారు.