ASR: డుంబ్రిగూడ మండలంలోని తుండ్రుంగూడ గ్రామంలో సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు మట్టి రోడ్లు బురదమయంగా మారడంతో కనీసం అడుగు వేయలేని పరిస్థితి నెలకొందని స్థానికులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తుండ్రుంగూడలో బురద రోడ్లతో అవస్థలు


