PDPL: ముత్తారం మండల కేంద్రంలోని కాసార్లగడ్డ బస్టాండ్ వద్ద సైబర్ భద్రత, గంజాయి నివారణపై ఎస్సై రవికుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరస్తులు బ్యాంక్ అధికారుల పేరుతో మోసాలు చేస్తున్నారని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకూడదని తెలిపారు. మోసం జరిగితే 1930కి, గంజాయి సమాచారం 1908కి తెలపాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్సైలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు.
తెలంగాణ
సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన: ఎస్సై


