హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికపై లైంగికదాడి కేసులో ఇద్దరి అరెస్ట్‌

HYD: బండ్లగూడకు చెందిన బాలిక(15)పై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన నగరం ఉలిక్కిపడేలా చేసింది. పోలీసుల వివరాలిల ప్రకారం.. బార్కస్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తున్న బాలిక.. ఇంటి నుంచి పనికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటోలో ఉన్న అహ్మద్, అస్లాం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.