హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లి పేరుతో రూ.30 లక్షల మోసం

HYD: పెళ్లి పేరుతో రూ.30 లక్షలు తీసుకుని కులం పేరుతో దూషించాడని బీఆర్ఎస్ నేత జక్కుల కిరణ్ కుమార్ పై నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడికి ఇప్పటికే పెళ్లైన విషయం దాచిపెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు బాధితురాలు ఆరోపించింది. వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి రూ.30 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.