హైదరాబాద్: 28°C
వార్తలు

రహదారి కష్టాలతో గ్రామస్తుల నరకయాతన

ASR: భరతనాపల్లి-లక్కవరపాడు రహదారి అధ్వానంగా మారడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకుల కోసం రాకపోకలు సాగించాలన్నా గుంతలు, బురదతో అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. తాజాగా రాజుపేట మార్గంలో కిరాణా సరుకులతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో రహదారి దుస్థితి మరోసారి వెలుగుచూసింది.