హైదరాబాద్: 28°C
వార్తలు

'నిత్యవసర ధరలను తగ్గించాలని నిరసన'

కృష్ణా: గుడివాడ శ్రీనివాస్ సెంటర్లో ఐద్వా ఆధ్వర్యంలో నిత్యవసర ధరలు తగ్గించాలని బుధవారం నిరసన చేపట్టారు. రోజురోజుకీ నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు, మధ్యతరగతి వర్గాల మీద అదనపు భారం పడుతుందని, ఉపాధి లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా కార్యదర్శి రజిని అన్నారు. ప్రభుత్వం నియంత్రణ కమిటీలు వేసి, ధరలను అదుపులో ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు.