హైదరాబాద్: 28°C
వార్తలు

ఆహార విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ

కృష్ణా: మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో హోటల్లు, రెస్టారెంట్లు ఆహార విక్రయ కేంద్రాలను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా కట్టెల పొయ్యలపై ఆహార పదార్థాలను వండుతున్నట్లు ఆయన గుర్తించారు. ఈ విధమైన చర్యలు ప్రజా ఆరోగ్యానికి హానికరమే కాకుండా, పరిసరాల పరిశుభ్రతకు భంగం కలిగిస్తాయన్నారు.