BDK: అశ్వాపురం మండలం గొల్లగూడెం శివారులో బుధవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో చేపట్టిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 40.560 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
తెలంగాణ
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం


