హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు సైబర్‌ నేరాలపై ఎస్పీ అవగాహన

BDK: కొత్తగూడెం మండలంలో అబ్దుల్‌ కలాం కళాశాలలో బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఐపీఎస్‌ విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.