హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి: మేయర్

PDPL: రామగుండం కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులను మెరుగైన, నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలని మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించి, పనులను పర్యవేక్షించాలని తెలిపారు. టెండర్లు పూర్తయిన పనులను తక్షణమే ప్రారంభించాలని, జాప్యం చేసే కాంట్రాక్టర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మేయర్ అన్నారు.