హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూలపేట పోర్టులో ధర్నా

SKLM: సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టులో మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది బుధవారం ధర్నాకు దిగారు. జీతాలు ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, అద్దెలు, పిల్లల చదువులకు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమాచారం తెలుసుకున్న హెచ్ఆర్ మేనేజర్ రాఘవరెడ్డి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.