హైదరాబాద్: 28°C
తెలంగాణ

OTPలు ఎవరితోనూ పంచుకోవద్దు: ఎస్పీ

MHBD: ముత్యాలమ్మగూడెంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైబర్‌ భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్పీ డా. శబరీష్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. OTPలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, మొబైల్‌ను బాధ్యతగా వినియోగించాలని తెలిపారు.