హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మందుల దుకాణాల్లో తనిఖీలు

VZM: ఆపరేషన్ గరుడలో భాగంగా బుధవారం విజయనగరం ఔషధ నియంత్రణ అధికారిణి ఆర్.లలిత, ఈగల్ టీం సభ్యులు కొత్తవలసలోని పలు మందుల షాపుల్లో సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఎక్స్ (NRX) మందుల అనధికార నిల్వలు, రికార్డులను పరిశీలించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, సరైన బిల్లులు లేకుండా వీటిని విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.