హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిజర్వాయర్‌లో మునిగి విద్యార్థి మృతి

SDPT: కొండపోచమ్మ రిజర్వాయర్‌లో స్నేహితులతో కలిసి విహారానికి వచ్చిన ఓ కళాశాల విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. సికింద్రాబాద్ ఓల్డ్‌బోయినపల్లికి చెందిన నేపాలి మోహన్ ప్రసాద్(18) బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నీటిలోకి దిగిన సమయంలో లోతైన ప్రాంతంలో మునిగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.