హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాకాల పార్కులో అరుదైన పక్షి

WGL: పాకాల బయోడైవర్సిటీ పార్కులో జువైనైల్‌ వైట్‌-ఐడ్‌ బజార్డ్‌ బూతస్తూర్‌ పక్షి సందర్శకుల కంటపడింది. పక్షి ప్రియులు ఆసక్తిగా వీక్షించి కెమెరాల్లో బంధించారు. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఈ వేటపక్షి కీటకాలు, మిడతలు, బల్లులు, కప్పలు, చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటుంది. చిన్న పక్షుల్లో గోధుమ కళ్ల రంగు, తెల్లని నుదురు ప్రత్యేక లక్షణాలు.