హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాహుల్‌ గాంధీపై కేసు రద్దు చేయాలి: యూత్‌ కాంగ్రెస్‌

BDK: మణుగూరు మండల కేంద్రంలో రాహుల్‌ గాంధీపై పెట్టిన కేసును నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు చీకటి కార్తీక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలసాని సంజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. రాహుల్‌ గాంధీపై పెట్టిన కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.