WGL: మామునూరు విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమైన సీఎం, భూసేకరణ పూర్తి చేసి అప్పగించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రెండు వారాల్లో టెండర్లు పిలిచి, డిసెంబర్‌లో ఖరారు చేసి అదే నెలలో పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
తెలంగాణ
డిసెంబర్‌లో మామునూరు పనులకు శంకుస్థాపన


