హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

W.G: న్యాయవాదుల పూర్తి వృత్తి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రతకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతూ.. బుధవారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తణుకు బార్ అసోసియేషన్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.