హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుల్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్

ADB: ఉట్నూర్ మండలంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించిన గణేష్‌ను అరెస్ట్ చేసినట్లు SHO విజయ్ తెలిపారు. మే 11న రాత్రి కొత్తగూడెం చెక్‌పోస్ట్ వద్ద డీజే ఆపమన్నందుకు, మద్యం మత్తులో కానిస్టేబుల్ ప్రసాద్ కాలర్ పట్టుకుని దురుసుగా నిందితుడు ప్రవర్తించాడని పేర్కొన్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.