హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు కాలువ పక్కన గడ్డి వ్యర్థాలను తరలించాలి

WNP: ఆర్టీసీ కాలనీలో విద్యుత్ నియంత్రిక వద్ద మురుగు కాలువ పక్కన తొలగించిన గడ్డి వ్యర్థాలను తరలించాలని కాలనీవాసులు కోరారు. రెండు రోజుల క్రితం పుర సిబ్బంది గడ్డి, కాలువలోని వ్యర్థాలను తొలగించి అక్కడే వదిలేశారు. గడ్డి వ్యర్థాలు గాలికి రోడ్డుపైకి కొట్టుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలను తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.