హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓదెల మాస్టర్ ప్లాన్‌పై జగద్గురు సలహాలు

PDPL: ఓదెల మల్లన్న ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు బుధవారం శ్రీశైల జగద్గురు డా. చెన్న సిద్దరామ పండితారాధ్యులను కలిశారు. స్థపతి వల్లినయాగన్‌తో కలిసి మాస్టర్ ప్లాన్ వివరించి సలహాలు తీసుకున్నారు. అనంతరం జగద్గురు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఈవో, అర్చకులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.