హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుల వివక్షపై రాష్ట్రపతికి మల్లు రవి లేఖ

NGKL: కుల వివక్ష, అంటరానితనం వంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలపై నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కీలక లేఖ రాశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం జరిగినట్లు చెబుతున్న “శుద్ధీకరణ” ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజ్యాంగపరమైన జోక్యం చేసుకుని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.