అరటిపండులో పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తిన్న వెంటనే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కండరాల నొప్పులను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఆందోళనను తగ్గించడంలో అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. ఇది కడుపులో అల్సర్‌లను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆరోగ్యం
అరటిపండు తింటే ఎన్ని లాభాలో తెలుసా?


