హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి తిరువీధి ఉత్సవం

BHNG: ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగించగా, భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. మేళతాళాలు, మృదంగం, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఉత్సవ సేవ భక్తులను ఆకట్టుకుంది.